Wednesday, June 6, 2012

కార్యకర్తే పార్టీకి ఆధారం

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనేవాడు గుండెకాయ లాంటివాడు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి చేరవేయడం కాని ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని వారికి సహాయం చేస్తుంటాడు. ప్రజలు పెద్ద నాయకుల మాట వింటారో లేదో కాని ఆ కార్యకర్త ఒక గుర్తు చూపించి దాని పైన గుద్దు అంటే తప్పకుండ వేస్తారు. ఎందుకంటే అతడు వారకి నిత్యం అందుబాటులో ఉంటాడు(ప్రజల అవసరాలని క్యాష్ చేసుకునే వాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నీతి గల కార్యకర్తల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి).

నేను ఒక రాజకీయ పార్టీని చాలా దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను.మా నాన్న ఒక సంప్రదాయ పార్టీకి మండల స్థాయి కార్యకర్త(నేను మాత్రం కాదండోయ్). పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి దాన్ని ఓటు రూపంలో మార్చే శక్తి కార్యకర్త కి మాత్రమె ఉంటుంది. కాని నేను కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ లో విన్నాను మన లోకసత్తా పార్టీ కి కార్యక్తలు లేని లోటు చాలా ఉందని. దానికి మనం ఎం చేయాలి? పార్టీకి కార్యకర్తల్ని తాయారు చేసుకోవాలి. పార్టీ కోసం తపించే వాలు కావాలి. మన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజలకి తెలియజేసే వాళ్ళు కావాలి. అలా మన పునాదులు నిర్మించుకోవాలి. 2014 ఇంకా ఎంతో దూరం లేదు, ఆ లోపు వీలైనంత వారకి పార్టీలో పనిచేసే వారకి వారి వారి సామర్ధ్యం బట్టి భాద్యతలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను.

ప్రతి గ్రామంలో గ్రామ కమిటిలు, బూత్ కమిటిలు వేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో యువత మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయం. వారు ఇప్పటినుంచి స్థానికంగా ఉన్న సమస్యలు తేస్కోని పోరాడితే కొంచెం ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. ఒక్కో కార్యకర్త కనీసం 20 ఓట్లు సంపాదించినా అది మనకి కొండంత శక్తినిస్తుంది.

1 comment:

  1. వారసత్వం కాదు ప్రత్యామ్నాయం

    పార్టీ అంటేనే ఒక గొప్ప ఆశయం. పార్టీలు చాలా గొప్పవి, వాటి ఆశయాలు కూడా గొప్పవేనని అంటున్నారు మేధావులు.
    ఇందుకు, మన నాయకులు ఎంచుకున్న మార్గం "రాజకీయ వారసత్వం". ఆశయ సిద్ధికి వారసులే అఖ్ఖర లేదు. ఎవ్వరైనా సరే, తమనంటిపెట్టుకుని 24 గంటలు జెండా పట్టుకుని తిరిగే తమ పాలేరే కావచ్చు ఆశయ సాధనకు అర్హుడు. తమరు చెప్పిన ఆశయాలు, దాని యందలి ఆదర్శాలు విని చదివి అపుడిపుడే యవ్వనంలోకి అడుగిడుతున్న యువత, తమరి వంటి గొప్ప రాజకీయ వేత్తకు మరెవ్వరు సాటిలేరు అని గొప్పగా చెప్పుకుంటూ తమ జీవితం మరిచి నాయకుల చెంత చేరి తమ దొక్క ఎండుతున్నా పట్టించుకోకుండా ఎత్తిన జెండా దించకుండా అలుపెరుగని వీరుల్లా పోరాడి సాధించిన ఘనతకు మీరిచ్చే బహుమానం చీదరింపులు, ఈసడింపులు.
    ఇకనైనా మన నేతల మస్తిస్కాల్లో ఏ కొంచెమైనా స్వార్థానికి చోటు కరువైతే నిజమైన నాయకత్వ వారసులకు అవకాశాలివ్వండి. అంతేగాని, తన తర్వాత తన బిడ్డా, తన మనవడు, ముని మనవడు ఇలా ఇలా పోతూవుంటే ఇక మానవ మేధస్సుకు సముచిత స్థానం ఎప్పటికీ లభించదు. మీరు గొప్ప శిష్యులను సంపాదించుకొండి. రాజకీయ వారసత్వం అంటే తమ ఆశయాలకు కట్టుబడి తన సర్వస్వం అర్పించే ఏకలవ్య శిష్యులను తయారు చేయండి. అంతే కానీ కన్న బిడ్డలే కానఖ్ఖర లేదు మీ ఆశయ సిద్ధికి.
    మీరూ త్యాగ ధనులే, మీ అనుభవాన్నంతటినీ ధారగ పోసి ఒక్క వీరుడిని తయారు చేయగల సత్త మీకే ఉంది. మీరు వెనకగ ఉండి ఆదర్షవంతులు కండి. అందరిలోనూ తమను చూసుకోండి. తమరు మిగతావారికంటే వేరేమి కాదని నిరూపించండి. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి పునాదులు వేయండి. లోకాస్సమస్థాస్సుఖినో భవంతు అని లోకాలకు చాటండి. మీవంటి ఆదర్ష ప్రాయులు మల్లీ మల్లీ ఈ భువిని ముద్దాడాలని ప్రజలంతా ముక్త కంఠంతో ఆహ్వానం పలకాలి. అద్దీ జీవితమంటే.

    శ్రీ ప్రఙ్ఞేశ్వర వైదిక & ధర్మ ప్రచార సమితి - mallik1973@hotmail.co.uk

    ReplyDelete