Friday, November 16, 2012

నమ్మకం..

నీ స్థాయి కి మించిన సహాయం చేస్తే ఆ దేవుడు నీ అర్హత కి మించిన ఫలితం ఇస్తాడు..
                                                                                         -నా నమ్మకం 

Sunday, July 22, 2012

అర్హుడా...?

దేశానికి సేవ చేసిన వారిని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన వారిని కుర్చోపెట్టాల్సిన కుర్చీలో ఒక పార్టీకి సేవ చేసాడని, ఒక వ్యక్తి  విశ్వాసం పొందాడని ఆ పదవిలో కుర్చోపెట్టడం మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా?
అవినీతి పై ఎంత ఉద్యమం జర్గుతున్నా ఆ అవినీతిపరులనే అందలం ఎక్కిస్తున్నారు మన నాయకులు. ఆ నాయకులకి  వంత పాడడం మన తెలివిగల (అని అనుకుంటున్న) ప్రజల వంతు..!

Sunday, June 10, 2012

మీరైనా చెప్పండి....

మూడేండ్ల క్రితం నాటి ఒకటి గుర్తువచ్చింది...
నేను మా ఊర్లో ఒక అతనితో మాట్లాడుతూ "ఎందుకయ్యా ఇలా పైసలు తిస్కోని ఓటు వేస్తారు? వాడు గెలిచాక మీకు ఏం పని చెయ్యడు, ప్రభుత్వం పైసలు అన్ని మేక్కుతాడు. ఇలా అయితే మీకు ఏం పనులు కావు.. తప్పు అయ్యా అన్నాను"... అప్పుడు అతను " తింటే తినని అయ్యా....! అవ్వి ఏమన మా ఇంట్లో సొమ్మా? ప్రభుత్వం సొమ్మే కదా..!" నాకు ఏం చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉండిపొయ్యా .
ఇంట్లో సొమ్ము.. ప్రభుత్వం సొమ్ము ఒకటే అని చెప్పే బాధ్యత నాపైనే ఉంది అని నాకు అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు తెలిసినా చెప్పలేని దూరంలో ఉన్నాను.. మీరైనా చెప్పండి...

Wednesday, June 6, 2012

కార్యకర్తే పార్టీకి ఆధారం

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనేవాడు గుండెకాయ లాంటివాడు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి చేరవేయడం కాని ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని వారికి సహాయం చేస్తుంటాడు. ప్రజలు పెద్ద నాయకుల మాట వింటారో లేదో కాని ఆ కార్యకర్త ఒక గుర్తు చూపించి దాని పైన గుద్దు అంటే తప్పకుండ వేస్తారు. ఎందుకంటే అతడు వారకి నిత్యం అందుబాటులో ఉంటాడు(ప్రజల అవసరాలని క్యాష్ చేసుకునే వాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నీతి గల కార్యకర్తల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి).

నేను ఒక రాజకీయ పార్టీని చాలా దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను.మా నాన్న ఒక సంప్రదాయ పార్టీకి మండల స్థాయి కార్యకర్త(నేను మాత్రం కాదండోయ్). పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి దాన్ని ఓటు రూపంలో మార్చే శక్తి కార్యకర్త కి మాత్రమె ఉంటుంది. కాని నేను కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ లో విన్నాను మన లోకసత్తా పార్టీ కి కార్యక్తలు లేని లోటు చాలా ఉందని. దానికి మనం ఎం చేయాలి? పార్టీకి కార్యకర్తల్ని తాయారు చేసుకోవాలి. పార్టీ కోసం తపించే వాలు కావాలి. మన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజలకి తెలియజేసే వాళ్ళు కావాలి. అలా మన పునాదులు నిర్మించుకోవాలి. 2014 ఇంకా ఎంతో దూరం లేదు, ఆ లోపు వీలైనంత వారకి పార్టీలో పనిచేసే వారకి వారి వారి సామర్ధ్యం బట్టి భాద్యతలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను.

ప్రతి గ్రామంలో గ్రామ కమిటిలు, బూత్ కమిటిలు వేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో యువత మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయం. వారు ఇప్పటినుంచి స్థానికంగా ఉన్న సమస్యలు తేస్కోని పోరాడితే కొంచెం ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. ఒక్కో కార్యకర్త కనీసం 20 ఓట్లు సంపాదించినా అది మనకి కొండంత శక్తినిస్తుంది.

Tuesday, May 29, 2012

అమాయక ప్రజలారా!!!

అమాయక ప్రజలారా!!!
అసలు ఏం  జరుగుతుంది ఈ రాష్ట్రంలో..? లక్ష కోట్లు పందికొక్కు లా మెక్కిన, పేదలకి అందవలసిన డబ్బును తనకి, తన భజనగాల్లకి దోచిపెట్టిన వాడి కోసం ఇంత కలవరపడాలా..?

ఒక అవినీతిపరుడిని ఇంత వెనుకేసుకొచ్చే వారిని చూస్తుంటే అది వారి దౌర్భాగ్యమా లేదా ఈ సమాజం చేసుకున్న పాపమా..? అదేంటి అంటే వారి వాదనలు ఇలా ఉంటాయి." మా తాతాయ కి రూ.200 పెన్షన్ ఇచ్చాడు, నాకు ఫీసు కట్టాడు, మా అమ్మమ్మకి జ్వరం వస్తే ఉచితంగా వైద్యం చేసారు" అని అంటారు. ఇలా నాకు మాత్రం ఇస్తే చాలు మన దేశాన్ని ఎలా దోచుకున్న పర్వాలేదు అని అనుకునే స్వార్ధపరులు, అమాయకులు ఉన్నంతవారకి ఇలాంటివారు రేచ్చిపోతునే ఉంటారు. ఇక్కడ నేను ఆ అమాయకులని తప్పుబట్టడం లేదు, కాని నిజాన్ని తెల్సుకోమని చెప్తున్నాను. ఇంకా కొందరి వాదన మరీ దారుణంగా ఉంటుంది."ఎవరు తినలేదో చెప్పండి. వాడు తినలేదా..? వీడు తినలేదా..?" ఇలా వాడు అని వీడు అని తింటూ పోతు ఉంటె నీకు మిగిలేది ఏంటో ఒకసారి ఆలోచించు.

ఈ సందర్భం లో ఒక పెద్ద మనిషి  చెప్పిన కథ మీకు చెప్పదలచుకున్నాను. "రాము తన నెల జీతంతో ఇంటికి వెళ్ళడానికి బస్సు స్టాప్ కి వచ్చాడు .కొద్ది సేపటికి తన చేతిని వెనక జేబు పైన చేయి వేస్తే పర్సు లేదు. అక్కడే బెంచ్ పైన కుర్చుని ఏడుస్తున్నాడు, అందరు వచ్చి అయ్యో పాపం అని ఓదార్చి వెళ్తున్నారు. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి ఇంటికి వెళ్ళడానికి బస్సు చార్జిలకి వంద రూపాయలు ఇచాడు. అప్పుడు రాము దృష్టిలో ఆ  పెద్ద మనిషి దేవుడితో సమానం. కాని పాపం అమాయక రాముకి తెలియదు తన పర్సు కొట్టేసి, తనకి ఈ పరిస్థితి తెచింది ఆ "పెద్దమనిషి" అని. ఇపుడు మన ప్రజల స్థితి కూడా అలాగే ఉంది. వాళ్లకి లభించిన చిన్న చిన్న ఫలాలతోనే సంతృప్తి పడుతున్నారు కాని వాడు నెమ్మదిగా ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టునే నర్కుతున్నాడు అని ప్రజలు గ్రహించలేకపోతున్నారు.

ఇక ఆ దోచినవాడి కోసం తన తల్లి పడే ఆరాటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేశం కోసం యుద్దానికి వెళ్ళే సైనికుడిని పంపే తల్లి లా తన కొడుకుని ఆశీర్వదించి C.B.I విచారణ కి పంపిన ఈ తల్లి ని చూస్తే నాకు స్పూర్తినిచ్చిన ఒక రాజకీయ సినిమాలో తల్లి పాత్ర గుర్తుకొస్తుంది..."ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన  తన భర్త ఫై బాంబు దాడి జరగి ప్రాణాపాయ శితిలో ఉంటె ఏడుస్తూ  హాస్పిటల్ కి వచ్చి "ఇంకా ఎవరైనా..." అని తన భర్త సెక్యూరిటీ సిబ్బంది గురించి అడిగి వాళ్ల కుటుంబాలని పరమార్శిస్తుంది." ఇది ఒక  నాయకుడి భార్యకి మరొక నాయకుడి తల్లి ఉండల్సిన కనీస బాధ్యత. కాని ఇక్కడ తన కొడుకు చేసిన తప్పులకి ఎంతమంది ఐ.ఎ.ఎస్ లు, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు బలి అయ్యాయో ఆ తల్లి కి అర్ధం అవ్వట్లేదు. కాని అసలు సూత్రధారి తన కొడుకుపైకి వచ్చేసరికి ఈ ఆందోళనలు.ఇక్కడ ఆమె ఒక తల్లిలా కాకుండా ప్రజాప్రతినిధిగా, నాయకురాలిగా అలోచిచాలి.

ఇక మన మీడియా గురించి ఇక్కడ చెప్పాలి. ఈ అవినీతిపరుడి పైన ఎన్నో వార్తలు, చర్చలు, ప్రత్యక్ష ప్రసారాలు..రోజంతా ప్రపంచంలో అన్ని వదిలేసి అతని చుట్టే వాటి కెమరాలు పెడుతున్నాయి. జనాలకి మంచి నాయకుల కంటే ఇలాంటి వారి గురించే ఎక్కువ తెలుస్తుంది.  వారానికో గంట సేపు మంచి నాయకులని ఈ ప్రపంచానికి పరిచయం చేసి దాని వల్ల యువత కి స్పూర్తిని ఇద్దాం అని ఏ ఒక్క మీడియా ఆలోచించదు. అలా చేస్తే కోట్ల లో ఉన్న యువత లో పదుల సంఖ్య లో అయిన చైతన్యం రాదా..? ఆ  కొంత మంది యువత సరిపోదా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి.? మీడియా.. దయచేసి ఆలోచించండి...

ప్రజలారా..! మేల్కోండి.. రోజు ఒక అర్ధగంట సేపు మీ సమయాన్ని ఈ ప్రపంచంలో ఎం జర్గుతుందో తెల్సుకోవడానికి వేచ్చిచ్చండి. ఇక చదువుకున్న మేధావులారా..! ఆలోచించండి... నిజం ఏది..?అభాద్ధం ఏది..? న్యాయం ఏది..? అన్యాయం ఏది..? అని ఆలోచించండి.. తెలియని వారికి చెప్పండి. ఈ సమాజానికి మార్గదర్శకులు అవ్వండి...?
                                                                                                                                                                                                                                       ఆవేదన తో.... 
అవినీతిరహిత సమాజం కోరుకునే "నిస్సాయకుడు"

Tuesday, April 17, 2012

మన పిల్లలకి కూడా ఇదేనా...?

మన లాగే మన పిల్లలు కూడా ఈ కులగజ్జి, మతవిద్వేషాలు, అవినీతి లతో కూడిన సమాజం లోనే బ్రతకాలా? వాళ్లకి మెరుగైన సమాజం ఇవ్వలేమా...?

Wednesday, February 29, 2012

ఆలోచనల కార్యరూపం- కర్మిల్ల ఫౌండేషన్

ఈ రోజు నాకు చాల సంతోషం గా ఉంది. నా ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. చిన్నపటి నుండి నేను కన్న కలలు సాకారం అవుతున్నాయి. ఈ సమాజానికి ఏదో చేయాలనే నా తపన, ఈ నా జీవితానికి ఒక అర్ధం ఉండాలనే నా ఆవేదన కేవలం ఆవేశం ఏ కాదు అది ఏదైనా సాధించగలదని నేను నిరూపించిన రోజు.
"కర్మిల్ల ఫౌండేషన్" ని ఆరంబించాను. నా ఆలోచనలకి ఇది ఒక వారధి. ఇక నేను సాధించాలనుకున్నది ఈ ఫౌండేషన్ ద్వారా నేను కార్యరూపం లో కి తెస్తాను. నా ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఆశయాన్ని ఈ విధంగ సాధిస్తాను.

"కర్మిల్ల ఫౌండేషన్" కార్యక్రమాలను ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియ చేస్తాను. దీనికి మీ అందరి ఆశీసులు, సహకారం కావాలి..