Tuesday, April 8, 2014

కుటుంబ రాజకీయాలు... ఇంకెన్నాళ్ళు..?

తెలంగాణ పోరులో K.C.R ఎంతో పొరడారు. తెలంగాణా తెచ్చిన క్రెడిట్ మీకు కావాలి అనుకోవడం లో తపు లెధు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి రావాలి అనే మీ ఆలోచన ని ఎవరు ప్రశ్నించట్లేదు. కాని మీరు మీ కుటుంభం పైకి రావాలనే  ఉద్హేశం మాత్రం మంచిది కాదు. మీరు, మీ కొడుకు, కూతురు,అల్లుడు మొత్తం ఫ్యామిలీ అంత కట్ట కట్టుకొని ఎన్నికల్లో పోటి చేయడం మరీ ధారునమ్. ఇందు కోసమేనా మీరు తెలంగాన తెచ్చింది. తెలంగాణ అభివ్రుది చేయాలంటే మీరు అందరు అసెంబ్లీ కి పోవాల్సిన పని లేదు కద. ఎలాగు మీ పార్టి అధికారం లోకి వస్తది. వేరే వాళ్లకి అవకాశం ఇవ్వోచు కద. తెలంగాణ కోసం పోరాడిన ఎంతో మంది ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పార్టీ కి సేవ చేసిన ఎంతో మంది ఆ స్థానాల కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళ అందరిని కాదని 3 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు మీరే తీస్కుంటే మనం ఉన్నదీ ప్రజాస్వామ్యం లోనా లేక రాజరికం లోనా?

తెలంగాణా కోసం మా కుటుంభం మొత్తం పోరాడింది కదా అప్పుడు మీరు అనలేదు అని మీరు ప్రశ్నించొచ్చు. "మేము తెలంగాన కోసం పోరాడింది కేవలం మా కుటుంభ శ్రేయస్సు కోసమే" అని ఒక్క మాట చెప్పండి మిమ్మలిని ఎవరు అడగరు. ఆ ఒక్క కుటుంభానికి మన తెలంగాణ ప్రజలు బానిసలు గా ఉండడం. చి.. ఇదేం ప్రజాస్వామ్యం? తెలంగాణ తెచ్చినందుకు అతన్ని ఆరాధించండి తప్పు లేదు కాని ఇలా ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్ట సభల్లోకి కుటుంభం కుటుంభం వెళ్తుంటే మీరు హారతి పట్టడం ఏంటి ఇధి. ఈ కుటుంభ రాజకీయాలు పొవాలి. సామాన్యుడికి రాజకీయాలు అందుబాటులోకి రావలి. ప్రజా సేవ చేయాలి అని మనస్సు లో ఉన్న ప్రతివాడు ఏదో ఒక్కరూపం లో రాజకీయాల్లోకి రావడానికి వీలు ఉండాలి. వాళ్లకి పార్టీలు అవకాశం ఇవ్వాలి.

ఇది ప్రతి ఒక్క పార్టీకి వార్తిస్తుంది. కాంగ్రెస్ గురించి చెప్పదల్చుకోలేదు. వాళ్ళ అంత నీచ కుటుంభ రాజకీయాలు ఇంకా ఎవరు చెయ్యరు. వాళ్ళ పార్టీ మొత్తం తుదిచిపెట్టుకుపోతేనే దేశానికి మంచిధి. దరిద్ర్యం పొథది.అసలు వాళ్లకు దేశంలో ఉండే అర్హత లేదు అనేది నా ఉద్హేశం.

ప్రజలారా..! ఆలోచించండి... మనం ఉన్నదీ ప్రజాస్వామ్య దేశం లో అన్నది మర్చిపొకండి. ఆలోచించి వోటు వేయండి. చదువుకున్న అజ్ఞానులారా.... మీరు కూడా ఒక్క నిముషం అలోచించి ఓటు వేయండి.