Sunday, March 16, 2014

చదువుకున్న చేతకానివాడివా...?

మన ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, పాలకులు సేవకులు.
కాని ఇప్పుడు జర్గుతుంది ఏంటి? ప్రజలు వాళ్ళ వాళ్ళ రోజువారి పనిలో ఉంటె పాలకులు దేశాన్ని ధొచెస్థున్నరు. ఉదయం పేపర్ చదవుతుంటే అందులో వచ్చే వార్తలు చూసి 'చీ... వీళ్ళు ఇక మారరు.  దేశం మారదు. ' అని ఎంతో కోపంతో పేపర్ తిప్పేస్తాం మనం. అంతే కాని వాళ్ళనే మార్చి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని ఎన్నుకుంటాం అని మాత్రం ఆలోచించం. మల్లి ఎలక్షన్స్ వస్తాయి ఆ సమయం లో వాళ్ళు ఇచ్చె వెయ్యి రూపాయల నోటుకి, మద్యపానంకి, ఉచిత పథకాలకి ఆశపడి ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది మర్చిపోయి మల్లి వాళ్ళకే జై కొడుతాము. వాళ్ళనే ఎన్నుకుంటాము. ఇదేనా మనం చెసెధి. అలా చేసి ఐదు సంవత్సరాలు అయింది. మనకి ఇప్పుడు మల్లి అవకాశం వచ్చింది.ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి కూడా అలాగే చేద్దామా? ఇంత చదువులు చదివి కూడా ఎం తెలియనట్టు మల్లి వాళ్ళకే వేద్దామా? చదువుకున్న చేతకానివాడిలా మిగిలిపోదామా? మీరే ఆలోచించుకొండి.