Sunday, June 10, 2012

మీరైనా చెప్పండి....

మూడేండ్ల క్రితం నాటి ఒకటి గుర్తువచ్చింది...
నేను మా ఊర్లో ఒక అతనితో మాట్లాడుతూ "ఎందుకయ్యా ఇలా పైసలు తిస్కోని ఓటు వేస్తారు? వాడు గెలిచాక మీకు ఏం పని చెయ్యడు, ప్రభుత్వం పైసలు అన్ని మేక్కుతాడు. ఇలా అయితే మీకు ఏం పనులు కావు.. తప్పు అయ్యా అన్నాను"... అప్పుడు అతను " తింటే తినని అయ్యా....! అవ్వి ఏమన మా ఇంట్లో సొమ్మా? ప్రభుత్వం సొమ్మే కదా..!" నాకు ఏం చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉండిపొయ్యా .
ఇంట్లో సొమ్ము.. ప్రభుత్వం సొమ్ము ఒకటే అని చెప్పే బాధ్యత నాపైనే ఉంది అని నాకు అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు తెలిసినా చెప్పలేని దూరంలో ఉన్నాను.. మీరైనా చెప్పండి...

Wednesday, June 6, 2012

కార్యకర్తే పార్టీకి ఆధారం

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనేవాడు గుండెకాయ లాంటివాడు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి చేరవేయడం కాని ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని వారికి సహాయం చేస్తుంటాడు. ప్రజలు పెద్ద నాయకుల మాట వింటారో లేదో కాని ఆ కార్యకర్త ఒక గుర్తు చూపించి దాని పైన గుద్దు అంటే తప్పకుండ వేస్తారు. ఎందుకంటే అతడు వారకి నిత్యం అందుబాటులో ఉంటాడు(ప్రజల అవసరాలని క్యాష్ చేసుకునే వాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నీతి గల కార్యకర్తల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి).

నేను ఒక రాజకీయ పార్టీని చాలా దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను.మా నాన్న ఒక సంప్రదాయ పార్టీకి మండల స్థాయి కార్యకర్త(నేను మాత్రం కాదండోయ్). పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి దాన్ని ఓటు రూపంలో మార్చే శక్తి కార్యకర్త కి మాత్రమె ఉంటుంది. కాని నేను కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ లో విన్నాను మన లోకసత్తా పార్టీ కి కార్యక్తలు లేని లోటు చాలా ఉందని. దానికి మనం ఎం చేయాలి? పార్టీకి కార్యకర్తల్ని తాయారు చేసుకోవాలి. పార్టీ కోసం తపించే వాలు కావాలి. మన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజలకి తెలియజేసే వాళ్ళు కావాలి. అలా మన పునాదులు నిర్మించుకోవాలి. 2014 ఇంకా ఎంతో దూరం లేదు, ఆ లోపు వీలైనంత వారకి పార్టీలో పనిచేసే వారకి వారి వారి సామర్ధ్యం బట్టి భాద్యతలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను.

ప్రతి గ్రామంలో గ్రామ కమిటిలు, బూత్ కమిటిలు వేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో యువత మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయం. వారు ఇప్పటినుంచి స్థానికంగా ఉన్న సమస్యలు తేస్కోని పోరాడితే కొంచెం ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. ఒక్కో కార్యకర్త కనీసం 20 ఓట్లు సంపాదించినా అది మనకి కొండంత శక్తినిస్తుంది.