అమాయక ప్రజలారా!!!
అసలు
ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో..? లక్ష కోట్లు పందికొక్కు లా మెక్కిన,
పేదలకి అందవలసిన డబ్బును తనకి, తన
భజనగాల్లకి దోచిపెట్టిన వాడి కోసం ఇంత కలవరపడాలా..?
ఒక అవినీతిపరుడిని ఇంత వెనుకేసుకొచ్చే వారిని చూస్తుంటే అది వారి
దౌర్భాగ్యమా లేదా ఈ సమాజం చేసుకున్న పాపమా..? అదేంటి అంటే వారి వాదనలు ఇలా
ఉంటాయి." మా తాతాయ కి రూ.200 పెన్షన్ ఇచ్చాడు, నాకు ఫీసు కట్టాడు, మా
అమ్మమ్మకి జ్వరం వస్తే ఉచితంగా వైద్యం చేసారు" అని అంటారు. ఇలా నాకు మాత్రం
ఇస్తే చాలు మన దేశాన్ని ఎలా దోచుకున్న పర్వాలేదు అని అనుకునే
స్వార్ధపరులు, అమాయకులు ఉన్నంతవారకి ఇలాంటివారు రేచ్చిపోతునే ఉంటారు. ఇక్కడ
నేను ఆ అమాయకులని తప్పుబట్టడం లేదు, కాని నిజాన్ని తెల్సుకోమని
చెప్తున్నాను. ఇంకా కొందరి వాదన మరీ దారుణంగా ఉంటుంది."ఎవరు తినలేదో
చెప్పండి. వాడు తినలేదా..? వీడు తినలేదా..?" ఇలా వాడు అని వీడు అని తింటూ
పోతు ఉంటె నీకు మిగిలేది ఏంటో ఒకసారి ఆలోచించు.
ఈ సందర్భం లో ఒక పెద్ద మనిషి
చెప్పిన కథ మీకు చెప్పదలచుకున్నాను.
"రాము తన నెల జీతంతో ఇంటికి వెళ్ళడానికి బస్సు స్టాప్ కి వచ్చాడు
.కొద్ది సేపటికి తన చేతిని వెనక జేబు పైన చేయి వేస్తే పర్సు లేదు.
అక్కడే బెంచ్ పైన కుర్చుని ఏడుస్తున్నాడు,
అందరు వచ్చి అయ్యో పాపం అని ఓదార్చి వెళ్తున్నారు. అప్పుడు ఒక పెద్ద మనిషి
వచ్చి ఇంటికి వెళ్ళడానికి బస్సు చార్జిలకి వంద రూపాయలు ఇచాడు.
అప్పుడు రాము దృష్టిలో ఆ పెద్ద మనిషి దేవుడితో సమానం.
కాని పాపం అమాయక రాముకి తెలియదు తన పర్సు కొట్టేసి, తనకి ఈ పరిస్థితి తెచింది ఆ
"పెద్దమనిషి" అని. ఇపుడు మన ప్రజల స్థితి కూడా అలాగే ఉంది. వాళ్లకి లభించిన చిన్న చిన్న ఫలాలతోనే సంతృప్తి పడుతున్నారు కాని వాడు నెమ్మదిగా ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టునే నర్కుతున్నాడు అని ప్రజలు గ్రహించలేకపోతున్నారు.
ఇక ఆ దోచినవాడి కోసం తన తల్లి పడే ఆరాటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేశం కోసం యుద్దానికి వెళ్ళే సైనికుడిని పంపే తల్లి లా
తన కొడుకుని ఆశీర్వదించి
C.B.I విచారణ కి పంపిన ఈ తల్లి ని చూస్తే నాకు స్పూర్తినిచ్చిన ఒక రాజకీయ సినిమాలో
తల్లి పాత్ర గుర్తుకొస్తుంది..."ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తన భర్త ఫై బాంబు దాడి జరగి ప్రాణాపాయ శితిలో ఉంటె ఏడుస్తూ
హాస్పిటల్ కి వచ్చి "ఇంకా ఎవరైనా..." అని తన భర్త సెక్యూరిటీ సిబ్బంది
గురించి అడిగి వాళ్ల కుటుంబాలని పరమార్శిస్తుంది." ఇది ఒక
నాయకుడి భార్యకి మరొక నాయకుడి తల్లి ఉండల్సిన కనీస బాధ్యత. కాని
ఇక్కడ తన కొడుకు చేసిన తప్పులకి ఎంతమంది ఐ.ఎ.ఎస్ లు, ప్రభుత్వ ఉద్యోగులు
వారి కుటుంబాలు బలి అయ్యాయో ఆ తల్లి కి అర్ధం అవ్వట్లేదు.
కాని అసలు సూత్రధారి తన కొడుకుపైకి వచ్చేసరికి ఈ ఆందోళనలు.ఇక్కడ ఆమె ఒక తల్లిలా కాకుండా ప్రజాప్రతినిధిగా, నాయకురాలిగా అలోచిచాలి.
ఇక మన మీడియా గురించి ఇక్కడ చెప్పాలి. ఈ అవినీతిపరుడి పైన ఎన్నో వార్తలు, చర్చలు, ప్రత్యక్ష ప్రసారాలు..రోజంతా
ప్రపంచంలో అన్ని వదిలేసి అతని చుట్టే వాటి కెమరాలు పెడుతున్నాయి.
జనాలకి మంచి నాయకుల కంటే ఇలాంటి వారి గురించే ఎక్కువ తెలుస్తుంది.
వారానికో గంట సేపు మంచి నాయకులని ఈ ప్రపంచానికి పరిచయం చేసి దాని వల్ల యువత కి స్పూర్తిని ఇద్దాం అని ఏ ఒక్క మీడియా ఆలోచించదు.
అలా చేస్తే కోట్ల లో ఉన్న యువత లో పదుల సంఖ్య లో అయిన చైతన్యం రాదా..?
ఆ కొంత మంది యువత సరిపోదా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి.? మీడియా.. దయచేసి ఆలోచించండి...
ప్రజలారా..! మేల్కోండి.. రోజు ఒక అర్ధగంట సేపు మీ సమయాన్ని ఈ ప్రపంచంలో
ఎం జర్గుతుందో తెల్సుకోవడానికి వేచ్చిచ్చండి. ఇక చదువుకున్న మేధావులారా..!
ఆలోచించండి... నిజం ఏది..?అభాద్ధం ఏది..? న్యాయం ఏది..? అన్యాయం ఏది..? అని
ఆలోచించండి.. తెలియని వారికి చెప్పండి. ఈ సమాజానికి మార్గదర్శకులు
అవ్వండి...?
ఆవేదన తో....
అవినీతిరహిత సమాజం కోరుకునే "నిస్సాయకుడు"
మై డియర్ ఫ్రెండ్, నీ ఆవేదనకో అర్థం ఉంది. మనకేమి పనిలేక ఇష్టమొచ్చింది రాస్తున్నామనుకుంటున్నరు ఈ వెర్రి జనం. ఈ జనం ఇంతే కానీ, ఒక్క రోజొస్తుంది మల్లీ ఈ జనమే మనకు జేజేలు కొట్టేది. అంతవరకు వీరిని వదిలేద్దాం కానీ మన లక్ష్యన్ని కాదు. ఎప్పటికైనా మార్పు వస్తుంది. అంతవరకు, మన గమ్యం చేరే వరకు అలుపెరుగని వీరుడిలా పోరాటం సాగుతూనే ఉండాలి. నీకు మేమున్నాము. చింతించ వలదు. Pls mail to: mallik1973@hotmail.co.uk
ReplyDelete